Saturday 22 October 2016

Appreciation for Good Handwriting

Madhu Babu, Ravi Teja,  Anvari, Bhagya Sri, Sharmila, Sangeeta, Usha Sri and Meghana Sri
have received special prizes for showing great interest in improving their handwriting. 

ప్రస్తుతపు కంప్యూటర్ రోజుల్లో, ప్రింటర్లద్వారా డాక్యుమెంట్లని ముద్రించి వాడుకొంటున్నా కూడా చేతి వ్రాతకు ఉన్న ప్రాముఖ్యత వెలకట్టలేనిది. విద్యాలయాల్లో హ్యాండ్ రైటింగ్‌ని ప్రత్యేకమైన విద్యావిషయంగా నేర్పించ వలసిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తూ దీనిని అశ్రద్ద చేస్తున్నారు. అందువల్లనే బాగా చదువుకొన్నవాళ్ళు కూడా అందంగా వ్రాయలేకపోతున్నారు. విద్యార్థులకి చిన్నవయసు నుంచే మంచి చేతివ్రాతను అలవాటు చెయ్యకపోతే, రానురానూ వంకరటింకరగా వ్రాసే అలవాటును మార్చుకోవడం కష్టం అవుతుంది. `బ్యాడ్ హ్యాండ్‌రిటింగ్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఇంపెర్ఫెక్ట్ ఎడ్యుకేషన్` అని గాంధీజీ అన్న మాటలను దృష్టిలో ఉంచుకొని చక్కగా వ్రాయడం అలవాటు చేసుకోవాలి. క్షేత్ర స్కూల్‌లో ఈ విషయంలో ప్రత్యేక శిక్షణ తీసుకొంటూ త్వరత్వరగా అందమైన, కుదురైన చేతివ్రాతను అలవాటు చేసుకొంటున్న కొంత మంది చిన్నారులకి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరిగింది. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...