Thursday 14 September 2017

Hindi Diwas 2017

14 సెప్టెంబెర్ 1949 నుంచి హిందీ మన జాతీయభాషగా అమలులో ఉంది. అందువల్ల ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీని హిందీ దివస్‌గా జరుపుకొంటున్నాం. తెలుగు, ఇంగ్లిష్ భాషలతోపాటు హిందీని కూడా చదవడం, అర్థంచేసుకోవడం, మాట్లాడటం చేయగలిగితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మనదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో, కొన్ని విదేశాలలో హిందీని చక్కగా అర్థం చేసుకోగలిగిన, మాట్లాడ గలిగిన ప్రజలు ఉన్నారు. మనకి ఈ భాషలో ప్రవేశం ఉంటే... ఆయా ప్రదేశాలకు ఉద్యోగ లేదా వ్యాపార రీత్యా వెళ్ళి నప్పుడు; విహార యాత్రలకి వెళ్ళినప్పుడు ఎంతో సౌలభ్యం ఉంటుంది. మనం హిందీ మాట్లాడలేకపోతే అక్కడి వారు మనల్ని నిరక్షరాస్యులని చూసినట్టు చూస్తారు. 

హిందీలో చక్కని సాహిత్యం ఉంది. మంచి సినిమాలు, పాటలూ ఉన్నాయి.  వాటిని అనువాదాల రూపంలో కాకుండా నేరుగా అర్థం చేసుకోవడానికి హిందీని నేర్చుకోవడం అవసరం. పుస్తకాలని చదవడానికి ఎవరైనా కొత్త భాషని నేర్చుకొంటారా అనే అనుమానం మీకు రావచ్చు. కానీ ఎందరో మహానుబావులు సంస్కృతంలో ఉన్న భగవద్గీతని చదవడం కోసం మాత్రమే సంస్కృతాన్ని నేర్చుకొన్నారన్న సంగతి మీకు తెలుసా?    

హిందీ దివస్ వంటి వాటివల్ల విద్యార్థులకి  భాష పట్ల ఇష్టం పెరుగుతుంది, నేర్చుకోవాలన్న కుతూహలం కలుగుతుంది. ఆ రకమైన స్పూర్తిని పిల్లల్లో కలిగించడానికి ప్రత్యేకమైన రోజులని మన కేత్రస్కూల్‌లో జరపడం ఆనవాయితీగా ఉంది. ఈ రోజు జరిగిన కార్యక్రమం మేము అనుకొన్న ఉద్దేశ్యాన్ని సఫలీకృతం చేసిందని నిస్సందేహంగా చెప్పగలం. 




Kabirdas

Narendra Modi

Tulasi Das

Meerabai

Prem Chand

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...